ఆ లిస్టులో సమంత కూడా చేరిపోయిందిగా.!
- April 27, 2023హీరోయిన్లకు గుడి కట్టడం అనే సాంప్రదాయం ఇంతవరకూ తమిళనాడుకే పరిమితమైంది. ఖుష్బూ, హన్సిక తదితర ముద్దుగుమ్మలకు తమిళనాడులో గుడి కట్టి పూజలు చేసేస్తుంటారు అభిమానులు.
అయితే, ఈ సాంప్రదాయం ఇప్పుడు టాలీవుడ్‌కీ పాకేసినట్లయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంతకు ఓ అభిమాని గుడి కట్టేసి, ఆమెపై అభిమానం చాటుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
తెనాలి సందీప్ అనే వ్యక్తికి సమంత అంటే చాలా చాలా ఇష్టమట. కేవలం నటిగానే కాకుండా, సమంత చేసే సేవా కార్యక్రమాలకు ఆయన ఎక్కువ ఇన్స్‌పైర్ అయ్యాడట. దాంతో, తన ఇంటి ఆవరణలోనే సమంతకు గుడి కట్టేశాడట.
ఇకపోతే, సమంత ప్రస్తుతం ఓ వైపు సినిమాలూ, మరోవైపు వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ శుక్రవారం అనగా, ఏప్రిల్ 28న సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేయనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







