సెన్సారే షాకయ్యేలా.! కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ‘రామబాణం’.!
- April 27, 2023
గోపీచంద్‌కి ఈ మధ్య ఏ సినిమా చేసినా పెద్దగా కలిసి రావడం లేదు. దాంతో, తనకు గతంలో బాగా కలిసొచ్చిన డైరెక్టర్‌తో చేతులు కలిపాడు. గోపీచంద్ కెరీర్‌లో హిట్ చిత్రాలైన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాల దర్శకుడు శ్రీవాస్‌తో ఈ సారి గోపీచంద్ సినిమా చేశాడు.
అదే ‘రామబాణం’. మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి లేటెస్టుగా సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఒక్క అభ్యంతరకమైన సీన్ కూడా లేదనీ, కంప్లీట్ క్లీన్ మూవీగా ‘రామబాణం’ సినిమాని అభివర్ణించింది సెన్సార్ బోర్డ్.
నయా ట్రెండ్‌లో సెన్సార్ కట్ లేని సినిమాలే లేవంటే అతిశయోక్తి కాదేమో. అలాంటిది ‘రామబాణం’ సినిమా జీరో సెన్సార్ కట్స్‌తో రిలీజ్‌కి సిద్ధమవుతుండడం విశేషం. ‘ఖిలాడీ’ భామ డింపుల్ హయాతీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







