సౌదీ ఉత్తర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం..!

- April 29, 2023 , by Maagulf
సౌదీ ఉత్తర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం..!

జెడ్డా: సౌదీ అరేబియా ఉత్తర ప్రాంతాలైన టబుక్, అల్-జౌఫ్, నార్తర్న్ బోర్డర్స్ , హెయిల్‌లలో శనివారం నుండి సోమవారం వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 6-10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని వెల్లడించింది. సాధారణంగా వసంతకాలం(స్పింగ్ సీజన్)లో చురుకుగా ఉండే దుమ్ము తుఫానులు తగ్గుముఖం పట్టడంతో పాటు స్థిరమైన వర్షపాతం ఈ సంవత్సరం వసంత ఋతువులో ఉందని NCM ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా తూర్పు ప్రావిన్స్,  ఎర్ర సముద్రం తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, ఇప్పటి నుండి ఒక నెల తర్వాత వేసవి కాలం వస్తుందని NCM సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com