ఖతార్ లో 49% తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు

- April 29, 2023 , by Maagulf
ఖతార్ లో 49% తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు

దోహా: గత సంవత్సరాల్లో ట్రాఫిక్ భద్రత విషయంలో ఖతార్ సానుకూల ఫలితాలను సాధించింది.   ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అథారిటీ (PSA) విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. ఖతార్‌లో ఫిబ్రవరి 2023లో ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య గణనీయంగా తగ్గాయి.  ఫిబ్రవరిలో మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనలు 49.1 శాతం తగ్గి 104,992కి చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 206,258గా ఉన్నాయి. 135,839 ఉల్లంఘనలు నమోదైన జనవరి 2023తో పోలిస్తే అవి నెలవారీ ప్రాతిపదికన 22.7 శాతం తగ్గాయి.

ట్రాఫిక్ ఉల్లంఘనల్లో, వేగ పరిమితి ఉల్లంఘనల విభాగంలో అత్యధిక తగ్గింపు కనిపించింది. వార్షిక ప్రాతిపదికన పోల్చినప్పుడు, ఈ ఏడాది ఫిబ్రవరిలో వేగ పరిమితి ఉల్లంఘనలకు సంబంధించి 53,314 కేసులు నమోదయ్యాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 65.2 శాతం తగ్గి 63,779కి తగ్గాయి. నెలవారీగా, జనవరి 2023లో ఉల్లంఘనలు 86,495గా ఉన్నాయి. ఇది 38.4 శాతం తగ్గింపు సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘనలు 954గా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 77.2 శాతం తగ్గుదల నమోదైంది.  జనవరి 2023, నెలవారీగా 61.4 శాతం తగ్గి 2,472కి చేరుకుంది.  

అదే సమయంలో మెటాలిక్ ప్లేట్ల ఉల్లంఘనలు 17.1 శాతం తగ్గాయి. డ్రైవింగ్ ఉల్లంఘనలు 40.2 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలో నమోదైన మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనల్లో, వేగ పరిమితి ఉల్లంఘన (రాడార్) 60 శాతం ఉండగా, స్టాండ్ అండ్ వెయిట్ నియమాలు, బాధ్యతల ఉల్లంఘనలు 25 శాతం.. ఇతర విభాగంలో 15 శాతం ఉన్నాయి. ఫిబ్రవరిలో నమోదైన మొత్తం కొత్త వాహనాల సంఖ్య 5,862గా ఉంది. ఈ సంఖ్య నెలవారీ తగ్గుదల 8.2 శాతం కాగా.. వార్షిక తగ్గుదల 15.0 శాతంగా ఉంది.

అంతర్గత మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (MoI) మార్చి 5-11 తేదీలలో 35వ గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ (GCC) ట్రాఫిక్ వారాన్ని 'యువర్ లైఫ్ ఈజ్ ఏ ట్రస్ట్' అనే థీమ్‌తో జరుపుకుంది. ఇది ట్రాఫిక్ భద్రత ప్రాముఖ్యతపై అవగాహన, ట్రాఫిక్ నియమాలు -చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసింది.  రోడ్డు భద్రతను నిర్ధారించడానికి, ప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నియమాలను పాటించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు గుర్తు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com