యూఏఈలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్.. తగ్గిన డీజిల్ ధరలు

- April 30, 2023 , by Maagulf
యూఏఈలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్.. తగ్గిన డీజిల్ ధరలు

యూఏఈ: యూఏఈ ఇంధన ధరల కమిటీ మే నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. మే 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు దిర్హామ్ 3.16 అవుతుంది. ఏప్రిల్‌లో ఇది 3.01 దిర్హంగా ఉంది.  అలాగే ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh3.05 (ఏప్రిల్ Dh2.90) అవుతుంది. E-Plus 91 పెట్రోల్ ధర లీటరుకు 2.97 దిర్హాలు(ఏప్రిల్‌లో Dh2.82) అవుతుంది. డీజిల్‌ లీటరుకు 2.91 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఇది గత నెలలో 3.03 దిర్హాంలుగా ఉన్నది.

ఈ సంవత్సరం చివరి నాటికి యూఏఈ వృద్ధి 3.9 శాతానికి చేరుకుంటుంది. యూఏఈలో ద్రవ్యోల్బణం కూడా ఈ సంవత్సరం చివరి నాటికి 3.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేయబడింది. అంతకుముందు ఇది 4.8 శాతంగా అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం తగ్గుదల ప్రభావాలు స్థానికంగా అద్దెలు, వేతనాలు దీనికి దోహదం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com