అల్లరోడి కోసం మాస్ కా దాస్.!

- May 01, 2023 , by Maagulf
అల్లరోడి కోసం మాస్ కా దాస్.!

ఇటీవల ‘ ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ అనే సినిమాతో అల్లరి నరేష్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ధియేటర్లలో పెద్దగా ఈ సినిమాని పట్టించుకోలేదు కానీ, ఓటీటీ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది.

అల్లరోడి కొత్త అటెంప్ట్‌కి ఓటీటీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయ్. తాజాగా అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో కొత్త చిత్రం ‘ఉగ్రం’. విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మేకర్లు.

ఇప్పటికే ప్రమోషన్లు బాగా చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా సినిమాకి మరింత క్రేజ్ యాడ్ చేసేలా మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 

మాస్ కా దాస్‌ విశ్వక్ సేన్‌కి యూత్‌లో మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ ‘ఉగ్రం’ సినిమాకి యూజ్ అవుతుందేమో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com