‘విమానం’ ఎక్కిన రంగమ్మత్త.! ల్యాండింగ్ ఎప్పుడంటే.!
- May 01, 2023
హాటెస్ట్ యాంకర్‌గా బుల్లితెరపై పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం సినిమాల్లో తెగ బిజీ అయిపోయింది.
సుకుమార్ పుణ్యమా అని ‘రంగస్థలం’లో రంగమ్మత్త అవతారం ఎప్పుడయితే ఎత్తిందో.. అప్పటి నుంచీ అనసూయ భరద్వాజ్ దశ తిరిగిపోయింది. మూడు ఐటెం సాంగులూ, ఆరు స్పెషల్ రోల్స్.. అంటూ కెరీర్‌లో బిజీ అయిపోయింది.
బుల్లితెర కోసం టైమ్ కేటాయించలేనంత బిజీ అయిపోయింది అనసూయ భరద్వాజ్. ‘పుష్ప 2’లో దాక్షాయణి పాత్ర పోషిస్తోంది. అనసూయ చేతిలో ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ప్రస్తుతం చాలానే వున్నాయ్.
తాజాగా అనసూయ భరద్వాజ్ నటిస్తున్న ‘విమానం’ అనే సినిమా నుంచి కార్మికుల దినోత్సవం సందర్భంగా ఓ స్టిల్ రిలీజ్ చేశారు.

‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్రను తలపించేలా వుంది ఈ స్టిల్‌లో అనసూయ గెటప్పూ, సెటప్పూ. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. జూన్ 9న ‘విమానం’ ధియేటర్లలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా వుంది.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







