ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నారా.? అయితే ఈ పండు తప్పక తినాల్సిందే.!
- May 01, 2023
కివీ పండు.. ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ పండు మిగిలిన పండ్లతో పోల్చితే, రేటు కాస్త ఘాటుగానే వుంటుంది. అదేనండీ ఖరీదైన పండు.
అయితే, ఈ పండు నుంచి పొందే ఆరోగ్య ప్రయోజనాలు అంతే మెండు. కివీలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అలాగే, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రధ్ధ పెట్టేవారు కివీ పండు ఖచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
కివీలో క్యాలరీలు చాలా తక్కువ. సో, ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం పుష్కలంగా వుటాయ్.
గుండె జబ్బులు వున్నవారు తరచూ కివీ పండు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అలాగే, హైబీపీ, డయాబెటిస్ వున్న వాళ్లు కూడా కివీ పండును నిర్మొహమాటంగా తీసుకోవచ్చు.
క్యాలరీలు తక్కువగా వుండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో వుంచుతుంది. జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటూ, ఉదర సంబంధిత వ్యాధులు అదుపులో వుంచేందుకు కివీ పండు తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







