నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూత
- May 03, 2023
చెన్నై: దక్షిణాది ప్రముఖ నటుడు, దర్శకుడు మనోబాల ఇకలేరు. కొంతకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 69 సంవత్సరాల మనోబాల గత రెండు వారాలుగా కాలేయ సంబంధిత సమస్యల కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఈ వార్త తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అందరినీ షాక్కు గురి చేసింది. అతని అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన తెలుగులో చివరగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు. శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ లో విడుదలైన డాన్ చిత్రంలో స్కూల్ టీచర్ గా అందరినీ నవ్వించారు. మనోబాలకు భార్య ఉష మహదేవన్, కుమారుడు హరీశ్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







