ఖతార్ ఎయిర్వేస్ కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
- May 03, 2023
దోహా: బిజినెస్ ట్రావెలర్ మిడిల్ ఈస్ట్ అవార్డ్స్ 2023లో ఖతార్ ఎయిర్వేస్కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. దుబాయ్‌లో అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) 2023 సందర్భంగా అవార్డుల వేడుక జరిగింది. ఖతార్ ఎయిర్వేస్ దాని ప్రయాణీకులకు అసాధారణమైన సేవలను అందించడంలో ఎయిర్‌లైన్ నిబద్ధతను గుర్తించి అవార్డులకు ఎంపిక చేశారు. ఇండస్ట్రీ మ్యాగజైన్ రీజనల్ ఎడిషన్ పాఠకులచే ఓటు వేయబడిన ప్రకారం ఖతార్ ఎయిర్వేస్ 'ఉత్తమ వ్యాపార తరగతితో కూడిన ఎయిర్‌లైన్', 'మిడిల్ ఈస్ట్‌కు సేవలందిస్తున్న ఉత్తమ ప్రాంతీయ విమానయాన సంస్థ'గా నిలిచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైంది. ఈ అవార్డులను ఖతార్ ఎయిర్వేస్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఈస్టర్న్ రీజియన్స్, మర్వాన్ కొలీలాట్ ఎయిర్‌లైన్ తరపున స్వీకరించారు. ఈ వేడుకకు ప్రముఖ పరిశ్రమల ప్రముఖులు, విమానయాన నిపుణులు, ప్రపంచ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







