చిరంజీవి చెప్పిన డైలాగ్‌ను రాంచరణ్ పలికాడు
- May 10, 2016
'చిరుత'నయుడిగా తెరంగ్రేటం చేసిన రాంచరణ్ తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళ రీమేక్ 'తనీ ఒరువన్'లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'ధ్రువ' అనే పేరు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విషయమేమిటంటే.. చిరంజీవి నటించిన 'గ్యాంగ్‌లీడర్' విడుదలై మే 9వ తేదీకి పాతికేళ్లు పూర్తి చేసుకుంది. మాస్ హీరోగా చిరంజీవిని ఓ మెట్టు ఎక్కించిన ఈ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్‌ను రాంచరణ్ డబ్ స్మాష్చేశాడు. 'చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్ఫాడించేస్తా' అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్‌ను రాంచరణ్ పలికాడు. ఈ వీడియోను చెర్రీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికే చిరు పాటలను తన చిత్రాల్లో రీమిక్స్ చేస్తున్న చెర్రీ భవిష్యత్తులో 'గ్యాంగ్‌లీడర్' లాంటి మాస్ మసాలా కథతో వస్తాడేమో చూడాలి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







