పోలీసు మద్యం మత్తులో మమ్మల్ని దుర్భాషలాడాడు.
- May 04, 2023
న్యూ ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద అర్థరాత్రి సమయంలో ఢిల్లీ పోలీసులు , రెజ్లర్ల కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ పోలీసు మద్యం మత్తులో మహిళా రెజ్లర్ల పై దురుసుగా ప్రవర్తించాడని, దుర్భాషలాడాడని రెజ్లర్లు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు మాతో ప్రవర్తించిన తీరు బాధగా ఉంది. మేం నేరస్తులం కాదు. ఇలాంటి రోజులు చూడటానికా మేము పతకాలు సాధించింది అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మద్యం మత్తులో ఓ పోలీసు మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జంతర్ మంతర్ వద్ద వర్షం కారణంగా మా పరుపులు తడిసిపోయాయని, వాటి స్థానంలో మడత మంచాలను తీసుకొస్తుండగా పోలీసులు అనుమతించలేదని వినేష్ ఫోగట్ చెప్పారు. ఈ సమయంలో పోలీసులు తమ పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారని అన్నారు. పోలీసుల తీరుతో ఇద్దరు క్రీడాకారులకు గాయాలయ్యాయని చెప్పారు. మహిళలు ఉన్నచోట మహిళా పోలీసులు లేకపోవటంపై ఫోగట్ ప్రశ్నించారు.
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లో నాలుగు పతకాలను గెలుచుకున్నాని, మేము నేరస్తులమా? అని వినేష్ ఫోగట్ కన్నీటి పర్యాంతమయ్యారు. నా పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు. మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి.. ఈ రోజు చూడ్డానికి మేము దేశం కోసం పతకాలు సాధించామా? మేము తిండికూడా తినలేదు. మహిళలను దుర్భాషలాడే హక్కు ప్రతి పురుషుడికి ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. పోలీసులు తుపాకులు పట్టుకున్నారు. వారు మమ్మల్ని చంపగలరు అని ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







