తెలంగాణ హైకోర్టు వద్ద దారుణ హత్య

- May 04, 2023 , by Maagulf
తెలంగాణ హైకోర్టు వద్ద దారుణ హత్య

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు వద్ద ఓ యవకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గేట్ నెంబర్ 6 సమీపంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న మిథున్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై దుండగుడు హత్య చేశాడు. జనం చూస్తుండగానే కత్తితో పొడిచాడు.

అనంతరం పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. రూ. 10 వేల విషయంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com