ఢిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్
- May 04, 2023
న్యూ ఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందులోభాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరారు. బేగంపేటలోని ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయణమయ్యారు. మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు.
అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్కు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు ఢిల్లీకి బయలుదేరారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







