మన్ కీ బాత్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా: డాక్టర్ సరికొండ వినయ్

- May 05, 2023 , by Maagulf
మన్ కీ బాత్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా: డాక్టర్ సరికొండ వినయ్

విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం దిగ్విజయంగా 100 వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలో సీతమ్మధార వద్ద ఉన్న కళ్యాణ మండపంలో 500 మంది కార్యకర్తలతో స్క్రీన్లు ఏర్పాటు చేసి వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అయోధ్య రామ జన్మభూమి నేషనల్ చీఫ్ ఆర్గనైజర్, ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్, డేటా బాస్ ఐ ఎన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డైరెక్టర్ అండ్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ సరికొండ వినయ్ విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ గారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా భారత ప్రజలందరికీ ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగిందని అంతేకాకుండా సామాజికంగా ప్రతి ఒక్కరు ఎదిగేటట్టు, స్ఫూర్తినిచ్చేటట్టు ఉపయోగపడ్డాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఇంచార్జ్ కోడూరి లక్ష్మీనారాయణ గారు, అనకాపల్లి ఇంచార్జ్ ప్రకాష్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్చార్జ్ పల్లి శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర కోశాధికారి కంట భక్తుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యడ్ల రమణ రాజు, రాష్ట్ర నాయకులు దాసరి శివ శంకర్ రావు, జిల్లా ఇంచార్జ్ బోగాది స్వామి నాయుడు, ఉపాధ్యక్షులు వలిరెడ్డి శ్రీ నివాసరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి కిలపర్తి సత్యనారాయణ , రాగతి రమణమ్మ మరియు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com