సౌదీ ట్రావెల్: మూడు నెలల్లో 8 మిలియన్ల మంది పర్యాటకులు
- May 06, 2023
సౌదీ అరేబియా: 2023 మొదటి త్రైమాసికంలో 8 మిలియన్ల మంది పర్యాటకులు సౌదీ అరేబియాను సందర్శించారు. ఇది తాము రూపొందించిన అంచనాల కంటే అధికమని సౌదీ టూరిజం అథారిటీ సీఈఓ ఫహద్ హమిదాద్దీన్ తెలిపారు. 2022లో సౌదీని 93 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారని పేర్కొన్నారు. 2023 మొదటి 3 నెలల్లో ఉమ్రా సందర్శనల సంఖ్య 4 మిలియన్లకు చేరుకుందని దుబాయ్‌లో అరేబియా ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్ సందర్భంగా హమీదాద్దీన్ తెలిపారు. సౌదీ అరేబియాలో ప్రస్తుతం 42,000 హోటల్ గదులు నిర్మాణంలో ఉన్నాయని, 2030 చివరి నాటికి హోటల్ గదుల సంఖ్య 700,000 దాటుతుందని భావిస్తున్నామని హమీదాద్దీన్ చెప్పారు. సౌదీ వింటర్ సీజన్ మాదిరిగానే, రాజ్యంలో వేసవి సీజన్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఏడాది వ్యవధిలో ప్రభుత్వం వేర్వేరు వీసాలను ప్రకటించడం వల్ల సౌదీ అరేబియాకు వచ్చేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







