ప్రముఖ ఆసియా గమ్యస్థానానికి Dh10కే టిక్కెట్
- May 07, 2023
దుబాయ్: ఫిలిప్పీన్స్‌లోని టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఒకటైన సెబు పసిఫిక్, కేవలం 10 దిర్హామ్‌లకే విమాన టిక్కెట్‌లను అందిస్తోంది. శుక్రవారం జరిగిన క్యారియర్ 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అతి తక్కువ విమాన ఛార్జీలను ప్రకటించారు. మే 5 నుండి 9 వరకు, దుబాయ్ నుండి మనీలాకు వెళ్లే ప్రయాణికులు తమ విమానాలను వన్-వే బేస్ ధర Dh10తో బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ వ్యవధి తప్పనిసరిగా జూన్ 1 నుండి నవంబర్ 30, 2023 వరకు ఉండాలి. సెబు పసిఫిక్ – దుబాయ్, మనీలా మధ్య ప్రతిరోజూ రెండుసార్లు ప్రయాణించే మార్గం. యూఏఈ నుండి.. వచ్చే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలకే టిక్కెట్లను అందిస్తోంది. దీని టిక్కెట్ ధరలు ఇతర విమానయాన సంస్థల కంటే 54 శాతం వరకు తక్కువగా ఉంటాయి. విదేశీ ఫిలిపినోలు, పర్యాటకులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురానుందని ఎయిర్‌లైన్ చీఫ్ మార్కెటింగ్, కస్టమర్ విభాగం హెడ్ కాండిస్ ఐయోగ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









