సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- April 18, 2026
రియాద్ః సౌదీ అరేబియా క్యాబినెట్ మనీలాండరింగ్ నిరోధక చట్టానికి సవరణలను ఆమోదించింది. ఇందులో భాగంగా దోషులుగా తేలిన నేరస్థులపై ప్రయాణ నిషేధాన్ని విధించడం, ఆస్తులను జప్తు చేసే చర్యలను విస్తరించడం వంటి కొత్త నిబంధనలను చేర్చింది. సవరించిన ఆర్టికల్ 28 ప్రకారం.. మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష పడిన సౌదీ జాతీయులపై, అంతే కాలానికి విదేశాలకు ప్రయాణించకుండా నిషేధం విధిస్తారు. అదే సౌదీయేతర నేరస్థులు తమ శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత దేశం నుండి బహిష్కరిస్తారు. నిబంధనల ప్రకారం హజ్ లేదా ఉమ్రా యాత్రలకు మినహా తిరిగి రాజ్యంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తారు.
ఆర్టికల్ 33 ప్రకారం.. నేరం రుజువైనప్పుడు, కోర్టులు మనీలాండరింగ్ ద్వారా సంపాదించిన నిధులు, సంబంధిత ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించవచ్చు. నేరస్థుని చట్టబద్ధమైన ఆదాయానికి మించి ఉన్న ఆస్తులు, అలాగే నేర కార్యకలాపాల నుండి వచ్చినవని రుజువైతే, న్యాయస్థానాలు వాటిని కూడా జప్తు చేయవచ్చు.
సవరించిన నిబంధనల ప్రకారం.. ఆస్తులు నేరంతో ముడిపడి ఉన్నాయని రుజువైతే, అవి నేరస్థుని వద్ద ఉన్నా లేదా మూడవ పక్షం వద్ద ఉన్నా సరే వాటిని జప్తు చేయడానికి న్యాయస్థానాలకు అధికారం ఉంది. అలాగే, లావాదేవీలు లేదా కార్యకలాపాలను రద్దు చేయడానికి లేదా నిలిపివేయడానికి కూడా న్యాయస్థానాలకు అధికారం ఉంటుంది. ఈ సవరణలలో చట్టంలోని అనేక నిబంధనల నుండి “లాభాపేక్ష లేని సంస్థలు” అనే పదాన్ని తొలగించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







