అల్ అవీర్ ప్రమాదంలో ఫైర్ ఫైటర్ మృతి.. షేక్ హమ్దాన్ సంతాపం

- May 07, 2023 , by Maagulf
అల్ అవీర్ ప్రమాదంలో ఫైర్ ఫైటర్ మృతి.. షేక్ హమ్దాన్ సంతాపం

దుబాయ్: దుబాయ్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఫైర్ ఫైటర్ సార్జెంట్ ఒమర్ ఖలీఫా అల్ కెత్బీ మృతి చెందాడు. సార్జెంట్ ఒమర్ మృతికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంతాపం తెలిపారు. అతని కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. దుబాయ్ మొదటి డిప్యూటీ పాలకుడు షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా సార్జెంట్ ఒమర్ అల్ కెత్బీ కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఒమర్ దుబాయ్ ప్రజల హృదయాలలో సజీవంగా ఉంటాడని యూఏఈ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఫెడరల్ టాక్స్ అథారిటీ (ఎఫ్‌టీఏ) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ కూడా అయిన షేక్ మక్తూమ్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com