పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
- May 09, 2023
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ హైకోర్టులో హాజరుపర్చిన తరువాత ఇమ్రాన్‌ను రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు గతంలో చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన్ను అరెస్టు చేయడం సాధ్యం కాలేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం, దీంతోపాటు కోర్టులో ఆయనకు ఉపశమనం లభించడంతో ఇంతకాలం ఆయన్ను అరెస్టు చేయలేదు. కాగా, ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేస్తున్న సమయంలో కోర్టు దగ్గర గొడవలు చెలరేగాయి. ఇమ్రాన్ లాయర్‌కు ఈ గొడవలో తీవ్రగాయాలయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







