విదేశీ క్రెడిట్ కార్డ్ ఖర్చులపై BHD50,000 క్యాష్‌బ్యాక్: ఐలా బ్యాంక్
- May 10, 2023
బహ్రెయిన్: 31 డిసెంబర్ 2023 వరకు అమలులో ఉండే ‘ఇంటర్నేషనల్ స్పెండ్ అండ్ విన్’ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఐలా డిజిటల్ బ్యాంక్ ప్రకటించింది. ఇందులో భాగంగా 50 మంది అదృష్ట ఐలా క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు వారి ప్రయాణం, ఇ-కామర్స్ ఖర్చులపై విదేశీ కరెన్సీలలో BD1,000 వరకు తిరిగి పొందే అవకాశాన్ని అందిస్తుంది. ఐలా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు BD1,000 వరకు తిరిగి పొందేందుకు అర్హత పొందాలంటే కనీసం BD300ని విదేశీ కరెన్సీలలో, అంతర్జాతీయంగా లేదా ఇ-కామర్స్ కొనుగోళ్లలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏదైనా విదేశీ కరెన్సీలో ఖర్చు చేసిన ప్రతి BD50 కి డ్రాలో పాల్గొనడానికి ఒక అవకాశం లభిస్తుందని ఐలా బ్యాంక్ మార్కెటింగ్ & అక్విజిషన్ హెడ్ అబ్దుల్లా అబుయిడ్రీస్ తెలిపారు. తమ బ్యాంక్ కస్టమర్‌లకు వారి విదేశీ క్రెడిట్ కార్డ్ ఖర్చులను తిరిగి పొందడం ద్వారా మరపురాని ప్రయాణం, ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ఇంటర్నేషనల్ స్పెండ్ అండ్ విన్ క్యాంపెయిన్ రూపొందించబడిందన్నారు. MOIC ప్రతినిధి, ఐలా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లు, అంతర్గత ఆడిటర్ల సమక్షంలో ఐలా బ్యాంక్ కార్యాలయాలలో నెలవారీ డ్రాలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ నవంబర్ నెలలకు ఇద్దరు నెలవారీ విజేతలు.. జూన్, జూలై, ఆగస్టు మరియు డిసెంబర్ నెలలకు ప్రతి నెల పది మంది విజేతలను ఎంపిక చేస్తామన్నారు. పూర్తి క్యాష్‌బ్యాక్ బహుమతి మొత్తం (ఒక్కొక్కటి BD1,000 వరకు) విజేత క్రెడిట్ కార్డ్‌లో క్రెడిట్ చేయబడుతుందన్నారు. అయితే, ఐలా బ్యాంక్, బ్యాంక్ ABC ఉద్యోగులు ఈ డ్రాలో పాల్గొనేందుకు అర్హులు కాదని అబ్దుల్లా అబుయిడ్రీస్ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







