208 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసిన దుబాయ్ పోలీసులు
- May 10, 2023
యూఏఈ: 2023 మొదటి త్రైమాసికంలో యూఏఈ అంతటా మాదకద్రవ్యాల సంబంధిత నేరాల్లో మొత్తం అనుమానితుల్లో 47 శాతం మందిని దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్లలో 238 కిలోల డ్రగ్స్, 6 మిలియన్ నార్కోటిక్ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు, అమ్మకందారులను కట్టడి చేయడానికి అధికారులు సోషల్ మీడియాను ఫిల్టర్ చేశారు. ఈ సందర్భంగా 208 ఖాతాలు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించడంతో వాటిపై చర్యలు తీసుకున్నారు. ఆ పేజీలను బ్లాక్ చేశారు. మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా జప్తు చేయబడిన మొత్తంలో దుబాయ్ పోలీసుల మాదకద్రవ్యాల రవాణా 36 శాతంగా ఉందని తాజా డేటాలో వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో కొకైన్, హెరాయిన్, క్రిస్టల్ మెత్, ఓపియం, గంజాయి, హషీష్, మాత్రలు ఉన్నాయని దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రీ తెలిపారు. డ్రగ్స సరఫరా చైన్ ను అడ్డుకునేందుకు అంతర్జాతీయ కార్యకలాపాలకు మద్దతుగా ఉంటున్నామని, 2023 మొదటి త్రైమాసికంలో 65 మంది అనుమానితుల అరెస్టు చేశామని, ఖాట్, కొకైన్, గంజాయి మరియు హెరాయిన్‌తో సహా 842 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







