ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
- May 11, 2023
ఆస్తమా రోగుల్లో శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. నాలుగు అడుగులు వేసినా ఆయాసం వస్తుంది. గుండె దడగా వుంటుంది. భయం, ఆందోళన తదితర లక్షణాలు ఆస్తమా రోగుల్లో చూస్తుంటాం.
జలుబు, దగ్గు, వైరస్‌లే ఆస్తమాకి ప్రధాన కారణాలుగా చెప్పుకుంటాం. పదిమంది ఆస్తమా రోగుల్లో ఆరుగురికి చల్లటి గాలి కారణంగా ఆస్తమా వచ్చే ప్రమాదముంటుంది. నలుగురికి, కాలుష్యం, పూల పుప్పొడి ఇతరత్రా కారణాలు కావచ్చు.
ఆస్తమా రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? మసాలాలూ, శీతల పానీయాలు, చాక్లెట్లు తినకూడదు. దుమ్ము, ధూళి, ఘాటు వాసనలకు కాస్త దూరంగా వుండాలి. చల్లటి నీళ్లతో తలస్నానం చేయడం నిషిద్ధం. గోరువెచ్చని తాగునీటినే ఉపయోగిస్తే మంచిది. పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం చేయకూడదు.
ఆస్తమాని ప్రాధమిక దశలోనే గుర్తిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకప్పుడు ఆధునిక వైద్యంలో ఆస్తమాకి చికిత్స వుండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. ఆదునిక వైద్యం అందుబాటులో వుంది. ఆస్తమాపై గతంతో పోల్చితే, ఇప్పుడు మంచి అవగాహన కూడా వుంది.
కానీ, ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









