డేటింగ్ యాప్‌లు, అపరిచితుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను స్వీకరించవద్దు..
- May 12, 2023
యూఏఈ: డేటింగ్ యాప్‌లు, అపరిచితుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను స్వీకరించవద్దని అబుధాబి పోలీసులు హెచ్చరించారు.సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు, బ్లాక్‌మెయిలర్ల ననుంచి నిత్యం ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఈమేరకు గురువారం సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా ప్రైవేట్ ఫోటోలు, వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మోసగాళ్ళు వలలో పడితే బ్లాక్మెయిల్, దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. డేటింగ్ సైట్లు, యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలన్నారు.
మోసగాళ్ళ చేతికి చిక్కితే..
సైబర్ రాకెట్ల బారిన పడే వారు బెదిరింపులకు లొంగకుండా దృఢంగా ఉండాలని సూచించారు. డబ్బులు పంపొద్దు అని పోలీసులు తేల్చిచెప్పారు. బదులుగా, 24/7 అమన్ సేవ ద్వారా పోలీసులను సంప్రదించడం ద్వారా సంఘటనను నివేదించాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 8002626 (AMAN2626)కి కాల్ చేయవచ్చు లేదా 2828కి SMS పంపవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







