విదేశీయులకు 'బ్లడ్ బ్యాగ్' ఫీజులా?:KSHR
- May 12, 2023
కువైట్: ప్రవాసులు, నివాసితులు, సందర్శకులు 'బ్లడ్ బ్యాగ్' కోసం రుసుము చెల్లించాలని ఇటీవల కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం.. కువైట్‌లోని ప్రవాసులకు ఒక్కో రక్తపు బ్యాగ్‌కు KD 20, విజిట్ వీసాలో ఉన్న విదేశీయులకు KD 40 వసూలు చేస్తారు. అయితే కువైట్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (KSHR) ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని విషయాలను విస్మరించిందని తెలిపింది. ఆరోగ్య హక్కులతో సహా మానవ హక్కులకు సంబంధించి కువైట్ పాటించాల్సిన అంతర్జాతీయ బాధ్యతలు, అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణను అనుసరించడం, వివక్షత లేని విధానం ద్వారా ఆరోగ్య సంరక్షణ హక్కును అమలు చేయాలని కోరింది. ఈ నిర్ణయం వారి ప్రాణాలను రక్షించడానికి రక్తమార్పిడి అవసరమయ్యే కేసులను లక్ష్యంగా పెట్టుకుందని, ముఖ్యంగా ప్రసవ సమయంలో మహిళలను కాపాడుతుందని, అందువల్ల ఇది మహిళలపై అన్ని రకాల వివక్షతలను తొలగించడంపై కన్వెన్షన్ ఆర్టికల్ 12 లో పేర్కొన్న దానిని ఉల్లంఘిస్తుందని పేర్కొంది.
కువైట్ ఆర్టికల్ 12 పేరా 1ని కూడా ఉల్లంఘించిందని KSHR తెలిపింది ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అత్యున్నత ప్రమాణాలకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంటుందని తెలిపింది.కువైట్ కూడా 1996లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికకు అంగీకరించిందన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







