ప్రజా నైతికత ఉల్లంఘన కేసుల్లో 25 మంది అరెస్ట్
- May 13, 2023
బహ్రెయిన్: బహిరంగ ప్రదేశాల్లో మరియు సోషల్ మీడియా ఛానెల్‌లలో ప్రజా నైతికతను ఉల్లంఘించే కార్యకలాపాలలో పాలుపంచుకున్న 25 మందిని బహ్రెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. పలు కేసుల దర్యాప్తును అనుసరించి అరెస్టులు జరిగాయని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ మోరల్స్ డైరెక్టరేట్ తెలిపింది.అందిన సమాచారం ఆధారంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. ఎప్పుడైనా హాట్‌లైన్ (555)లో ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులను చేయాలని పౌరులు, నివాసితులను అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష