10వ సారి కింగ్స్ కప్ గెలుచుకున్న అల్-హిలాల్
- May 14, 2023
జెడ్డా: కింగ్ అబ్దుల్లా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్, ఇతర ఉన్నతాధికారులు వీక్షించిన కింగ్ కప్ ఆఫ్ ఛాంపియన్స్ ఫైనల్లో శుక్రవారం అల్-హిలాల్ ఫుట్‌బాల్ జట్టు పెనాల్టీలో 8-7తో అల్-వెహ్దాను ఓడించింది. ఈ విజయంతో రియాద్‌కు చెందిన అల్-హిలాల్ 66వ ట్రోఫీని.. 10వ కింగ్స్ కప్ ని.. ఈ సీజన్లో మొదటి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు హాజరై అల్-హిలాల్‌కు కప్‌ను అందించారు. ఒక వారం క్రితం అల్-హిలాల్ AFC ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన ఉరవ రెడ్ డైమండ్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసినదే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







