సౌదీ ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో 'ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు'
- May 14, 2023
సౌదీ అరేబియా: ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం సౌదీ అరేబియా ఆధ్వర్యంలో మే 12న డమ్మామ్ నందు అధ్యక్షులు ఖాలిద్ సైఫుల్లా ఆధ్వర్యములో యుగపురుషుడు "ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు", మినీ మహానాడు కార్యక్రమము ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏ .పి .ఎన్.ఆర్. టి చైర్మన్ డాక్టరు రవి కుమార్ వేమూరు, ఎన్.ఆర్.ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాథకృష్ణ దృశ్య మాధ్యము ద్వారా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డమ్మామ్ ఖోబర్ హస నగరముల నుండి ఎన్టీఆర్, తెలుగు దేశము అభిమానులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా చేసిన సంస్కరణలు గురించి, పటేల్, పట్వారి వ్యవస్థల రద్దు గురుంచి..ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు గురుంచి అందరూ గుర్తుచేసుకున్నారు.అలాగే నేటి ప్రభుత్వము చేస్తున్న విధ్వంసకర పరిపాలన గురించి, మరల చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాల్సిన ఆవశ్యకత గురించి తద్వారా మరల ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధిలో తీసుకు రావాలి అని రాధా కృష్ణ అందరిని కోరారు. కుల,మతాలకు అతీతము గా ఎన్టీఆర్ అభిమానులు ముఖ్యముగా తెలుగుదేశం కుటుంబసభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతము చేసారని ఖాలిద్ సైఫుల్లా తెలిపారు. ఈ కార్యక్రమ సమన్వయకర్తలుగా కార్యదర్శి భాస్కర్, డమ్మామ్ కోఆర్డినేటర్ జాకిర్ హుస్సేన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నరసింహ, రమణ, సత్య, నరేష్, రావు, ప్రసాద్, జాన్సన్, విక్టర్, సత్యనారాయణ షైక్ అహ్మద్, మిహమెద్ మాలిక్, చాన్ బాషా,అబ్దుల్, మజ్రుల్, మొహమ్మద్ అజాం, సుబ్రహ్మణ్యం, రాజా ఆగ, సిద్ధిక్, హనుమంత రావు, అబ్దుల్, ఇక్బాల్, హనుమంత, అబ్దుల జమీల్, సాహిక్ అదిల్, ముజమీల్, కొసరు అలీ, షఫీక్ పాల్గొన్నారు.


తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







