SSMB 28.! టైటిల్ కోసం ఎదురు చూపులు.!
- May 15, 2023
పల్నాడు బ్యాక్ డ్రాప్‌లో మహేష్ బాబు తాజా చిత్రం తెరకెక్కబోతోందని ఫస్ట్ లుక్ ద్వారా రివీల్ చేశారు. కానీ, ఇంతవరకూ టైటిల్ అయితే ఫిక్స్ చేయలేదు.
త్రివిక్రమ్ సినిమాలే కాదు, టైటిల్స్ కూడా చాలా చాలా ప్రత్యేకంగా వుంటాయ్. ఆ యాంగిల్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమాకి టైటిల్ ఏమై వుంటుందా.? అనే కోణంలో ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
గుంటూరు మిర్చి బ్యాక్ డ్రాప్‌లో వున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ని బట్టి, ఆ బ్యాక్ గ్రౌండ్‌కి తగ్గట్లుగానే ఓ పవర్ ఫుల్ టైటిల్ సెట్ చేసి పెట్టాడు గురూజీ అంటున్నారు. కానీ, ఈ లోపే ఫ్యాన్స్‌కి ఆత్రం ఆగడం లేదు. రకరకాల టైటిల్స్‌తో డిజైన్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో వదులుతున్నారు. అచ్చం ఒరిజినల్ పోస్టర్లను ఏమాత్రం తీసిపోకుండా వుంటున్నాయ్ ఆయా పోస్టర్లు. కానీ, గురూజీ జాప్యంపై ఫ్యాన్స్ ఒకింత గుస్సా అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో మూడో షెడ్యూల్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా వుంది. పూజా హెగ్దే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







