వెన్ను నొప్పికి హోమ్ రెమిడీస్.!

- May 15, 2023 , by Maagulf
వెన్ను నొప్పికి హోమ్ రెమిడీస్.!

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అత్యధికంగా బాధిస్తోన్న సమస్యల్లో ఒకటి వెన్నునొప్పి. సాప్ట్‌వేర్ తదితర ఉద్యోగాల నిమిత్తం ఎక్కువ సేపు కూర్చుని వుండడం, బైక్‌పై ఎక్కువ దూరం జర్నీ చేసే ఉద్యోగం కావడం.. ఇలా రకరకాల కారణాలతో వెన్నునొప్పి బాధితుల సంఖ్య అధికమవుతోంది.

మరి, వెన్ను నొప్పిని టెంపరరీగా తగ్గించుకునే క్రమంలో రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఇవి ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్‌కి కారణం కావచ్చు. అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమ్ రెమిడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెన్ను నొప్పికి ఆవనూనె మంచి ఔషధంగా పని చేస్తుంది. ఆవ నేనెతో నొప్పి వున్న చోట మర్దన చేస్తే చాలా బాగా పని చేస్తుంది.

అలాగే, కొబ్బరి నూనెలో కర్పూరం వేసి మెల్లగా మర్దన చేసినా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. మర్దన ఏదైనా చేసిన అరగంట తర్వాత వేడి వేడి నీటితో స్నానం చేయడం మర్చిపోకూడదు. అప్పుడే అసలు సిసలు ఉపశమనం. 

ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, హాట్ వాటర్ బ్యాగ్ మసాజ్ కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ట్రై చేసి చూడండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com