భువనేశ్వర్-దుబాయ్ విమాన సర్వీస్ ను ప్రారంభించిన ఇండిగో

- May 16, 2023 , by Maagulf
భువనేశ్వర్-దుబాయ్ విమాన సర్వీస్ ను ప్రారంభించిన ఇండిగో

దుబాయ్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం భువనేశ్వర్ నుండి దుబాయ్ వెళ్లే తొలి విమానాన్ని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెండా ఊపి ప్రారంభించారు. దుబాయ్ నుండి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు భువనేశ్వర్ లో ల్యాండ్ అయిన మొదటి డైరెక్ట్ ఫ్లైట్‌లో ప్రయాణించిన మొత్తం 174 మంది ప్రయాణికులను ఒడిశా మంత్రులు అశ్విని కుమార్ పాత్ర, టుకుని సాహు స్వాగతించారు. విమాన సర్వీసులను ఇండిగో ఎయిర్‌లైన్స్ వారానికి మూడుసార్లు(సోమ, బుధ, శుక్రవారం) నిర్వహిస్తుంది.

ఈ విమానం ఉదయం 11.25 గంటలకు దుబాయ్‌లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఒడిశా రాజధాని నుంచి సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.45 గంటలకు దుబాయ్ చేరుకుంటుందని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది.  

ఇదిలా ఉండగా.. సోమవారం భువనేశ్వర్ నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో మొత్తం 170 మంది ప్రయాణికులు బయలుదేరారు. సాయంత్రం 6 గంటలకు విమానం బయలుదేరే ముందు వారికి 'ఉత్తరియా', మిఠాయిలు అందించారు.

ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ..  ఒడిశాను దుబాయ్ వంటి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంతో కనెక్ట్ చేయడంతో భవిష్యత్ లో పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగం పెరుగుతుందని అన్నారు. పశ్చిమాసియాలో ప్రధాన టూరిజం జంక్షన్‌గా ఉన్న దుబాయ్.. యూరప్, అమెరికా మార్కెట్‌లకు గేట్‌వేను అందిస్తుందని ఆయన తెలిపారు.  ఆగ్నేయాసియాతో కనెక్టివిటీని పెంచేందుకు వచ్చే నెల నుంచి బ్యాంకాక్, సింగపూర్‌లకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com