ఇండియా సోషల్ సెంటర్ అబుధాబి ఎన్నికలలో తెలుగు వారి ఘన విజయం

- May 16, 2023 , by Maagulf
ఇండియా సోషల్ సెంటర్ అబుధాబి ఎన్నికలలో తెలుగు వారి ఘన విజయం

అబుధాబి: ప్రతిష్టాత్మక ప్రవాస భారతీయుల  సాంస్కృతిక  మరియు  సంక్షేమ  కేంద్రమయిన “India Social & Cultural Centre, Abu Dhabi”  2023 - 2024  సంవత్సరానికి యాజమాన్య (Managing Committee) సభ్యుల ఎన్నిక ప్రక్రియ 12  మే 2023 నాడు జరిగింది. ఎన్నిక ల ఫలితాలు శనివారం తెల్లవారు జామున DCD Ministry అధికారుల సమక్షంలో ప్రకటించారు.   

ఈ ఎన్నికలలో ఇద్దరు తెలుగువారు  జయకేతనం ఎగురవేశారు.గోపాల్  సిద్ధుల సాహితి కార్యదర్శి  (Hon Literary Secretary ) గా అంత్యంత అధిక మెజారిటీ తో గెలవడం జరిగింది. అలాగే మరో తెలుగు ప్రవాస భారతీయుడు ఎట్టిరెడ్డి శ్రీనివాస్ Southern Region Secretary గా ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్టు ప్రకటించడమయినది. ఇద్దరు  తెలుగు వారు  ఈ  విధంగా  ఒకేసారి రెండు పదవులకు ఎన్నిక అవడం ISC చరిత్ర లోనే మొదటిసారి అని సంఘ సభ్యుడు గంగారెడ్డి తెలియజేశారు. ఈ  ఇద్దరిలో , గోపాల్ హైదరాబాద్  వాస్తవ్యులు కాగా మరి ఎట్టిరెడ్డి శ్రీనివాస్ సిద్ధిపేట వాస్తవ్యులు. పదిహేను  సభ్యుల వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసీ  భారతీయుల  కార్య వర్గం, ఒక  సంవత్సరం పాటు  (2023-24) తమ కార్య కలాపాలు కొనసాగుతుంది.  

తమపై  నిలిపిన ఈ గురుతర బాధ్యత ను  నిర్వహించడంలో తమ శాయశక్తులా కృషి చేస్తామని  తెలియజేశారు. తమ కార్య నిర్వహణ  కాలంలో ఎన్నో  సాహితి, సాంస్కృతిక, క్రీడా మరియు సంక్షేమ  కార్యక్రమాలు చేయడం లో తమవంతు  కృషి  చేసి  అందరు  ప్రవాస  భారతీయుల ముఖ్యంగా  ISC సభ్యుల  మన్నలను  పొందడానికి  సర్వదా కృషి చేస్తామని మాగల్ఫ్  ప్రతినిధులతో  జరిగిన ముఖాముఖీ  లో  గోపాల్ మరియు శ్రీనివాస్  తెలియజేశారు. గోపాల్ మరియు శ్రీనివాస్ అపూర్వ విజయానికి  తోడ్పడిన అందరికి తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరుపున రాజా శ్రీనివాస రావు ఐత ధన్యవాదాలు తెలియజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com