భారత్‌లో 500 మంది ఉద్యోగులపై అమెజాన్ వేటు
- May 16, 2023
న్యూఢిల్లీ: ప్రముఖ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. భారత దేశంలో వివిధ స్థాయులలో పనిచేస్తున్న ఈ ఉద్యోగులకు మంగళవారం పింక్ స్లిప్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులలో 18 వేల మందిని తొలగించనున్నట్లు అమెజాన్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. దశలవారీగా తొలగింపులు చేపడతామని వివరించింది. ఈ కామర్స్ రంగంలో మందగమనం కారణంగా మానవ వనరులను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
ఇందులో భాగంగా 9 వేల మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించినట్లు సంస్థ సీఈవో అండీ జెస్సీ మార్చిలో ప్రకటించారు. వెబ్ సర్వీసులు, హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్ మెంట్ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే భారత్ లో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







