సౌదీలో ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం..40 ఏళ్లలో అత్యధికం
- May 16, 2023
రియాద్: సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలలో 2023 ఏప్రిల్‌లో అనూహ్యంగా 31.81 మిమీ వర్షపాతం నమోదైందని పర్యావరణం, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ (MEWA) ప్రకటించింది. ఇది 40 సంవత్సరాలలో నమోదు చేయబడిన అత్యధిక సగటని పేర్కొంది. ఇది ఏప్రిల్ 2022లో నమోదైన సగటు 9.23 మిమీ కంటే ఎక్కువ అని తెలిపింది. ఏప్రిల్ 25న అత్యధిక వర్షపాతం నమోదైందని, ఏప్రిల్ 14న అసిర్ ప్రాంతంలో 79 మిమీ నమోదయినట్లు తెలిపింది.
ఏప్రిల్ 2023లో సౌదీలో ఉన్న 146 డ్యామ్‌లలో 118 మిలియన్ క్యూబిక్ మీటర్లు, ఏప్రిల్ 2022లో 12.2 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరదనీరు చేరినట్లు మంత్రిత్వ శాఖ తన నివేదికలో తెలిపింది. అసిర్ ప్రాంతంలోని ఆనకట్టలలో 28.50 మిలియన్ క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ వరదనీరు వచ్చి చేరింది. నజ్రాన్‌లోని నజ్రాన్ డ్యామ్‌లో 20.59 మిలియన్ క్యూబిక్ మీటర్లు, జజాన్‌లోని బేష్ డ్యామ్‌లో 14 మిలియన్ క్యూబిక్ మీటర్లకు నీటిమట్టాలు చేరుకున్నాయి. కాగా, రైతులు,వృక్షసంపదను సంరక్షించడానికి ఏప్రిల్‌లో అన్ని డ్యామ్‌ల నుండి దాదాపు 57.7 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేసినట్లు నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







