కువైట్‌లో అపార్ట్‌మెంట్లను కొనేందుకు నివాసితులకు అనుమతి..!
- May 16, 2023
కువైట్: కువైట్‌లోని నాన్-కువైట్‌లు ఇన్వెస్ట్‌మెంట్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడానికి అనుమతించాలని కువైట్ మంత్రివర్గ కమిటీ కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. యాజమాన్యం కోసం దరఖాస్తుదారు కువైట్‌లో శాశ్వత, చట్టబద్ధమైన నివాసి అయితే, అతనిపై గౌరవం లేదా నమ్మకాన్ని ఉల్లంఘించే ఎలాంటి తీర్పులు జారీ చేయబడలేదని, పెట్టుబడి భవనంలో ఒక నివాస అపార్ట్‌మెంట్‌ను స్వంతం చేసుకునే హక్కును కువైటీయేతర వ్యక్తికి మంజూరు చేయవచ్చని ప్రతిపాదన నిర్దేశిస్తుంది. అతను కువైట్‌లో ఉన్న కాలంలో దరఖాస్తుదారు లేదా అతని కుటుంబం నివాసం కోసం అపార్ట్మెంట్ కేటాయించబడుతుందని, ఈ అపార్ట్మెంట్ విస్తీర్ణం 350 చదరపు మీటర్లకు మించకూడదని, అతను కువైట్లో మరొక అపార్ట్మెంట్ను కలిగి లేడని నిర్దారించున్న తర్వాతే అనుమతి ఇవ్వనున్నట్లు ప్రతిపాదనలో పేర్కొన్నారు. జూన్ 6న జాతీయ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు వారాల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం, దేశం దాటే డబ్బును పెట్టుబడుల కోసం ఆకర్షించడం ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ఆలోచన అని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







