అయ్యో పాపం కరాటే కళ్యాణి.! ఆమెపై ‘మా’ అంత చిన్న చూపా.?
- May 18, 2023
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, కమెడియన్ కమ్ నటి అయిన కరాటే కళ్యాణికి షో కాజ్ నోటీసులు పంపించారు. అదేంటీ.? అంతటి తప్పు ఏం చేసిందామె అంటారా.! చేసేసింది. ఏం చేస్తాం. మా అధ్యక్షులు శిక్షించేంత తప్పుగా పరిగణించాలా.? వద్దా.? అనేది ఎవరి అభిప్రాయానికి వారికే వదిలేయాలంతే.!
అసలు మ్యాటర్ ఏంటంటే.. రాముడు, కృష్ణుడు.. తదితర దేవుళ్లు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పెద్ద ఎన్టీయార్.. అయితే, మన ఇళ్లలోని దేవుళ్ల ఫోటోల్లో ఆయన ఎందుకు కనిపించరు.? అనవసరంగా ఈ వెర్రిని బలవంతంగా రుద్దేస్తున్నారు.. అందుకే సినిమా వేరు. నిజం వేరు.! అని కరాటే కళ్యాణి వ్యాఖ్యానించారు.
అంతే.! అలా మాట్లాడడమే ఆమె చేసిన తప్పు. ఆ తప్పుకు శిక్షను ఎంత ఫాస్ట్‌గా అమలు చేసేశారో చూశారా.? గౌరవనీయులైన ‘మా’ అధ్యక్షులు.
మా అధ్యక్షుడిగా ఆయన నిర్వర్తించాల్సిన ఎన్నో పెద్ద బాధ్యతలు వుండనే వున్నాయ్. అవేమీ కనిపించలేదు. నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతూ ఇండస్ట్రీ లోని ప్రముఖులను అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్న ప్రబుద్ధులు ఎందరో వున్నారు. వారెవరూ మా అధ్యక్షుడి కంటికి కనిపించలేదు. ఆ బూతు పురాణాలు వినిపించలేదు.
పాపం.! కరాటే కళ్యాణి బక్క ప్రాణం కదా.. అడిగే వాళ్లు లేరనుకున్నారో ఏమో.! ఇమీడియట్‌గా షో కాజ్ నోటీసులు పంపించేసి చేతులు దులిపేసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







