హైదరాబాద్‌కి హాలీవుడ్‌ని తీసుకొస్తున్న మంత్రి కేటీఆర్!

- May 18, 2023 , by Maagulf
హైదరాబాద్‌కి హాలీవుడ్‌ని తీసుకొస్తున్న మంత్రి కేటీఆర్!

అమెరికా: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ రంగం దూసుకుపోతుంది. దీంతో పలు ప్రభుత్వాలు ఆ రంగని ప్రోత్సహిస్తూ ఎకానమీ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నమెంట్ కూడా అటుగా అడుగులు వేస్తుంది. దేశంలో కొన్నేళ్లుగా సినిమా అండ్ గేమింగ్ అపారంగా ఎదుగు వస్తున్నాయి. దీంతో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్‌.. హైదరాబాద్ లో గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ రంగానికి ఒక డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ హాలీవుడ్ సంస్థ ముందు ప్రతిపాదన పెట్టారు. ప్రస్తుతం న్యూయార్క్‌ పర్యటనలో కేటీఆర్.. అక్కడ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారితో కేటీఆర్ సూధీర్ఘంగా చర్చలు అనంతరం.. ఇండియాలో త్వరలోనే ఒక డెవలప్‌మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని, సంస్థ ప్రారంభించిన మొదటి సంవత్సరంలో సుమారు 1200 మంది వరకు ఉపాధి కల్పిస్తామమని, ఫ్యూచర్ లో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించే లక్షయంతో డెవలప్‌మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయమంటూ అలెగ్జాండ్రా కార్టర్ తెలియజేసినట్లు కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.

కాగా HBO, CNN, TLC, Discovery, Discovery Plus, WB, Eurosport, Animal Planet, Cartoon Network, Cinemax, HGTV, Quest వంటి ప్రముఖ టెలివిజన్ ఛానల్స్ అండ్ స్ట్రీమింగ్ ఫ్రాంచైజీ లు వార్నర్ బ్రదర్స్ సంస్థకు చెందినవే. ఇది ఇలా ఉంటే, ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు. ఈ సమయంలో హాలీవుడ్ సంస్థ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం.. మన సినిమాలను హాలీవుడ్ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసే అవకాశం కలిపిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com