సంతోష్‌కి ఇకనైనా ‘మంచి శకునం’ లభించేనా.!
- May 18, 2023
సంతోష్ శోభన్.. అప్పుడెప్పుడో ‘పేపర్ బోయ్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు మంచి విషయమున్న నటుడే. కానీ, టైం కలిసి రావడం లేదు.
వరుసగా సినిమాలూ చేసుకుంటూ పోతున్నాడు కానీ, సరైన హిట్ఠు పడడం లేదు. తాజాగా ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్ గట్టిగానే చేశారు ఈ సినిమాకి. కానీ, తొలి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
సంతోష్ శోభన్ తన వరకూ తాను బాగానే ఫర్‌ఫామ్ చేసుకుంటూ పోయాడు. కానీ, అక్కడక్కడా టేకింగ్ కాస్త బోర్ కొట్టించేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
స్లో నెరేషన్, రన్ టైమ్ ప్రేక్షకుల్ని విసిగించేశాయ్ అంటున్నారు. మాళవికా నాయర్ ఈ సినిమాలో సంతోష్‌కి జోడీగా నటించింది.
అన్నట్లు ఈ మధ్య ‘కళ్యాణం కమనీయం’, ‘శోభన్ బాబు శ్రీదేవి’ సినిమాలతో ఆకట్టుకున్నాడు సంతోష్ శోభన్. ఇక, వెరీ లేటెస్ట్‌గా ‘అన్నీ మంచి శకునములే’ విషయానికి వస్తే, సమ్మర్ రిలీజ్ టైమింగ్ బాగానే వుంది. మరి, ఈ హాలీడే ప్యాకేజ్‌ని సంతోష్ యూజ్ చేసుకోగలడో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







