భారత్‌లో కొత్తగా 8 నగరాల ఏర్పాట్లు కేంద్రం యోచన
- May 19, 2023
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న నగరాలపై జనాభా ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం కొత్త నగరాల ఏర్పాటు దిశగా యోచిస్తోంది. దేశంలో మొత్తం ఎనిమిది నగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గురువారం జరిగిన ‘అర్బన్ 20’ సమావేశానికి కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ జీ20 యూనిట్ డైరెక్టర్ ఎంబీ సింగ్ హాజరయ్యారు. సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్త నగరాల గురించి ప్రస్తావించారు. 15వ ఆర్థిక సంఘం కొత్త నగరాలను ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు. పలు రాష్ట్రాలు ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 26 కొత్త నగరాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయని వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్రం 8 కొత్త నగరాల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తోందని చెప్పారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







