‘దేవర’గా ఎన్టీయార్.! అంచనాలు అప్పుడే కాదు సుమా.!

- May 20, 2023 , by Maagulf
‘దేవర’గా ఎన్టీయార్.! అంచనాలు అప్పుడే కాదు సుమా.!

యంగ్ టైగర్ ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా సినిమా నుంచి అప్‌డేట్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీయార్ నటిస్తున్న సినిమాకి టైటిల్ కన్‌ఫామ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

సముద్రానికి రాజుగా సీరియస్ ఇంటెన్స్ లుక్స్‌లో డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు ఈ లుక్స్‌లో ఎన్టీయార్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్న మాట వాస్తవమే.

అయితే, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎన్టీయార్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ అందుకుంది. ఇమేజ్‌తో పాటూ, బాధ్యత కూడా అదే స్థాయిలో వుంది ఎన్టీయార్ మీద.

కానీ, ‘ఆచార్య’ దెబ్బతో కొరటాల మీదే అందరికీ డౌట్ కొడుతోంది. అందుకే టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చినా ఏమంత అంచనాలు పెంచేయకుండా ఒకింత కామ్‌గా వున్నారు ఎన్టీయార్ అభిమానులు. లేదంటే ఈ పాటికి అహో, ఓహో అంటూ ఊదరగొట్టేసేవాళ్లు. 
అంచనాలన్నీ రిలీజ్ తర్వాతే చూసుకుందాం అన్నట్లుగా తుపాను ముందర సైలెన్స్ పాటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com