హైదరాబాద్‌కు అలియంట్ గ్రూపు, 9వేల ఉద్యోగ అవకాశాలు
- May 20, 2023
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు ఫలితంగా హైదరాబాద్ కు పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. మంత్రి కేటీఆర్ అమెరికాలో పలు కంపెనీల ప్రతినిధులుతో భేటీ అవుతున్నారు. పెట్టుబడులకు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ ఎంత అనుకూలమైనదో వివరిస్తు పెట్టుబడులను ఆకర్షించే విధంగా కృషి చేస్తున్నారు. ఆ కృషికి ఫలితంగా హైదరాబాద్ కు అలియంట్ గ్రూప్ (Alliant Group) రానుంది. హూస్టన్‌లో అమెరికాలో అలియంట్ గ్రూప్ సీఈవో ధవల్ జాదవ్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. దీంతో హైదరాబాద్ లోపెట్టుబడులకు అల్లియంట్ గ్రూప్ అంగీకరించింది. దీంతో తొమ్మిదివేల ఉద్యోగాలు లభించనున్నాయని కేటీఆర్ తెలిపారు.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలను పలు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. హైదరాబాద్ లో బీఎఫ్ఎస్ఐ రంగంలో అలియంట్ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ఈ గ్రూప్ హైదరాబాద్ కు రానుండటంతో 9 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే 1000 మందితో సేవలందిస్తున్న వెల్లియంట్ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లో విస్తరించటానికి సిద్ధమైంది.
కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పవర్‌హౌజ్‌గా పేరుగాంచిన అలియంట్ గ్రూపు .. హైదరాబాద్‌లోని బీఎఫ్ఎస్ఐ రంగాన్ని బలోపేతం చేయనుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దీంతో సదరు కంపెనీ హైదరాబాద్ లో 9వేల ఉద్యోగాలు కల్పించనుందని తెలిపారు. ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీస్, ఐటీ టెక్నాలజీకి చెందిన యువతకు ఇది మంచి అవకాశంగా మారుతుందన్నారు. బీఎఫ్ఎస్ఐ పరిశ్రమకు హైదరాబాద్ నగరం కేంద్ర బిందువుగా మారుతోందని..అలియంట్ సంస్థ తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ నగరంపై ఉన్న నమ్మకాన్ని చూపుతుందని మంత్రి తన ట్వీట్‌లో వెల్లడించారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్‌కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







