'ఎమిరేట్స్ పోస్ట్' నుండి నకిలీ డెలివరీ సందేశాలు..!
- May 22, 2023
యూఏఈ: ఎమిరేట్స్ పోస్ట్ నుండి ఇటీవల నకిలీ డెలివరీ సందేశాలు రావడం యూఏఈలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ పోస్ట్ స్పందించింది. ట్విట్టర్, సోషల్ మీడియా ద్వారా ఎమిరేట్స్ పోస్ట్ నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి మోసాల బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. "మేము మా ఎమిరేట్స్ పోస్ట్ రిజిస్టర్డ్ ఖాతా ద్వారా మాత్రమే SMS పంపుతాము" అని వారి వెబ్‌సైట్‌లో తెలిపింది. ఎమిరేట్స్ పోస్ట్ నివాసితులకు అటువంటి సందేశాలలో అందించిన లింక్‌లోకి లాగిన్ అవ్వొద్దని సూచించింది.
“తప్పు చిరునామా సమాచారం కారణంగా, మీ ప్యాకేజీ డెలివరీ కాలేదు. దయచేసి మీ షిప్పింగ్ చిరునామాను అప్డేట్ చేయండి.మీ డెలివరీని మళ్లీ షెడ్యూల్ చేయండి. అందుకు కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి." అంటూ పేక్ సందేశాలు కస్టమర్ల మొబైల్ కు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఎమిరేట్స్ పోస్ట్ తెలిపింది. చెల్లింపు లింక్‌తో డెలివరీకి సిద్ధంగా ఉన్న షిప్‌మెంట్ గురించి ఎలాంటి ఇమెయిల్‌ను ఎంటర్టైన్ చేయవద్దని నివాసితులను హెచ్చరించింది. “మేము మిమ్మల్ని Hotmail, Gmail, Yahoo లేదా మరే ఇతర సర్వర్‌ల ద్వారా ఎప్పటికీ సంప్రదించం. ఎమిరేట్స్ పోస్ట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా మా అధికారిక ఇమెయిల్ చిరునామాలు @emiratespost.ae లేదా @emiratesposthop.aeతో ముగుస్తాయి.’’ అని పేర్కొంది.
మోసగాళ్లు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి నివాసితులకు నేరుగా సందేశాలు పంపవచ్చని, అటువంటి ఖాతాలను వెంటనే బ్లాక్ చేసి, ఈ పేజీలను నివేదించాలని అధికార యంత్రాంగం అభ్యర్థించింది. ఈ స్కామర్‌ల వివరాలను నివాసితులు [email protected] లేదా 600599999కు నివేదించాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







