‘మళ్లీ పెళ్లి.’ ! రాజుగారూ.! మీకిది తగునా.!
- May 22, 2023
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి మంచి మంచి ఫ్యామిలీ మూవీస్ తెరకెక్కించిన నిర్మాత ఆయన. కానీ, ఇప్పుడు దర్శకుడిగా మారారు.
బోల్డ్ సినిమాలు తీస్తూ సెన్సేషనల్ అవుతున్నారు. పెద్దాయనే. ఈ వయసులో ఆయనకిలాంటి సినిమాలు తెరకెక్కించాలన్న కోరిక ఏంటో.!
అడిగితే ఇకపై అలాంటి సినిమాలు ఇంకెన్నో తెరకెక్కించి వైరల్ అవ్వాలనుకుంటున్నా.. అంటూ జుగుప్స కలిగించేలా సంచనల వ్యాఖ్యలు చేశారీ పెద్దాయన.
ఇంతకీ ఆ పెద్దాయన మరెవరో కాదు, ఎమ్.ఎస్ రాజుగారు. తాజాగా ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా తెరకెక్కించారు. ‘డర్టీ హరి’, ‘7 నైట్స్ 6 డేస్’ అనే బోల్డ్ సినిమాలు తీశారు గతంలో.
తాజాగా తీసిన ‘మళ్లీ పెళ్లి’ కూడా కాస్త అటూ ఇటూగా అలాంటి కోవలోకే చేరుతుంది. ఈయనంటే ఎంతగానో గౌరవించే చాలా మంది ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు విస్తుపోతున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ జంటగా తెరకెక్కిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే.
ఎవ్వడేమనుకుంటే నాకేంటీ.! అన్న చందంగా ఈ సినిమాని అబ్బో.! తెగ ప్రమోట్ చేస్తున్నారులెండి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







