‘ధూత’ అయినా చైతూని కాపాడుతుందా.?
- May 22, 2023
ఈ మధ్య ‘కస్టడీ’ అనే సినిమాతో నాగ చైతన్య ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు.
దాంతో, చైతూ అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. త్వరలో చైతూ నుంచి ‘ధూత’ అను ఓ వెబ్ సిరీస్ రానుంది. తొలిసారి నాగ చైతన్య నటిస్తున్న వెబ్ సిరీస్ ఇది.
హారర్ కంటెంట్‌తో కూడిన ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా ఓటీటీ జనాన్ని అలరించేలా వుండబోతోందని అంటున్నారు. ఓటీటీలో కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారు.
అంతేనా.! స్టార్ సెలబ్రిటీలు సెలెక్ట్ చేసుకున్న ఓటీటీ కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా ఓ ఆట ఆడేసుకుంటారంతే. మొన్నీ మధ్య ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌తో వెంకటేష్‌నీ, రానాని అలాగే ఓ ఆటాడేసుకున్నారు.
అలాగే, చైతూ విషయంలోనూ, అసలే ప్రస్తుతం చైతూ టైమ్ ఏమంత బాగాలేదు. ఈ వెబ్ సిరీస్ అయినా చైతూని నిలబెడుతుందో లేదో చూడాలి మరి. జూలైలో ‘ధూత’ను ప్రముఖ ఓటీటీ ఛానెల్ అమెజాన్ వేదికగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







