ఒమన్ లో 925 మంది ఖైదీలు విడుదల
- May 23, 2023
మస్కట్: "ఫక్ కుర్బా" ఇనిషియేటివ్ 10వ ఎడిషన్‌లో భాగంగా ఒమన్ సుల్తానేట్ లోని వివిధ గవర్నరేట్‌ల నుండి 925 మంది ఖైదీలు విడుదలైనట్లు ఒమానీ లాయర్స్ అసోసియేషన్ (OLA) వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ నుంచి 194, ఉత్తర అల్ బతినా- 191, దక్షిణ అల్ బతినా- 122, అల్ దహిరా- 97, అల్ బురైమి- 87, అల్ దఖిలియా- 79, ఉత్తర అషర్కీయా- 59, అషర్కీయా- 40, ధోఫర్- 33, అల్ వుస్తా- 20, ముసందం- 3 కేసులు ఉన్నాయని OLA ఛైర్మన్ డా. మహమ్మద్ బిన్ ఇబ్రహీం అల్-జడ్జాలీ తెలిపారు. తాము ఆర్థిక క్లెయిమ్‌ల కోసం ఖైదు చేయబడిన లేదా జైలులో ఉన్న 5,894 మంది ఖైదీలను సమిష్టిగా విడుదల చేసామన్నారు. దీనిని విజయవంతం చేయడానికి సహకరించిన వ్యక్తులు, సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







