‘సింహాద్రి 4k’ హిట్టా.? ఫట్టా.?
- May 23, 2023
ఎన్టీయార్ బర్త్ డే సందర్భంగా ‘సింహాద్రి’ సినిమాని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. భారీ ఎత్తున హంగామా చేసి ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు.
అంతా బాగానే వుంది. ఇంతకీ ‘సింహాద్రి’ రీ రిలీజ్ హిట్టా.? ఫ్లాపా.? అనే చర్చ నడుస్తోందిప్పుడు. రీ రిలీజ్ సందర్భంగా 8 కోట్లు వసూళ్లు సాధించిందని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంత.?
ఫస్ట్ రిలీజ్ టైమ్‌లోనూ సింహాద్రిని బలవంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆడించారన్న టాక్ వుంది. తద్వారా వచ్చిన సొమ్ములు తిరిగి దానికే ఖర్చు చేయడంతో, భారీగా నష్టపోయారు నిర్మాతలు అనే ప్రచారం వుంది.
అదే తప్పు ఇప్పుడు కూడా చేస్తున్నారా.? ఎందుకంత పంతం.? హార్ట్ ఫుల్‌గా ఆడితే ఆడిందని చెప్పాలి. కానీ, ఎందుకీ దాగుడుమూతలు దండాకోర్.. అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
రీసెంట్‌గా రామ్ చరణ్ ఫ్లాప్ మూవీ అయిన ‘ఆరెంజ్’ని రీ రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టింది. అప్పుడు నష్టపోయిన నిర్మాతలు ఇప్పుడు చాలా చాలా హ్యాపీ పీలయ్యారు ‘ఆరెంజ్’ సినిమా విషయంలో.
అలా వుండాలే కానీ, ‘సింహాద్రి’ విషయంలో జరుగుతున్న ఈ అత్యుత్సాహం వల్ల ఎవరికి లాభం.?
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







