గుండెపోటు రాకుండా జాగ్రత్త పడండిలా.!

- May 23, 2023 , by Maagulf
గుండెపోటు రాకుండా జాగ్రత్త పడండిలా.!

చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ మధ్య గుండె పోటు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండానే కార్డియాక్ అరెస్టులు, ప్రాణాపాయం జరుగుతోంది. 

గుండెను సురక్షితంగా వుంచుకోవాలంటే ప్రతీరోజూ తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకవడం వుత్తమం అని గుండె సంబంధిత నిపుణులే చెబుతున్నారు.
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ కదా.! ఇంతకీ ఏంటా మార్పులు చూద్దాం.

వెల్లుల్లి గుండెను ఆరోగ్యంగా వుంచేందుకు చాలా సహాయపడుతుంది. రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వంటి సమస్యలకు దూరంగా వుంచుతుంది. అందుకే ప్రతీరోజూ ఏదో ఒక టైమ్‌లో ఒక చిన్న గ్లాసుడు వెల్లుల్లి రసాన్ని తీసుకోవడం మంచిదట.

అలాగే, గోరు వెచ్చని నీటిలో కానీ, పాలలో కానీ, కాస్త పసుపు వేసుకుని పరగడుపున తాగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తకుండా వుంటాయ్. తద్వారా గుండెపోటు నుంచి దూరంగా వుండొచ్చు. గుండె ఆరోగ్యంతో పాటూ, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

ద్రాక్ష రసం, రెడ్ వైన్ తాగడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్తుతుందని ఆరోగ్య నిపుణులు చేబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com