యువత సాధికారతకు ప్రోత్సహం: HH షేక్ ఖలీద్
- May 24, 2023
బహ్రెయిన్ : బహ్రెయిన్ యువత సాధికారతకు చాలా ప్రాముఖ్యతనిస్తుందని సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ (SCYS) మొదటి డిప్యూటీ చైర్మన్, జనరల్ స్పోర్ట్స్ అథారిటీ (GSA) అధ్యక్షుడు మరియు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (BOC) అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా చెప్పారు. యువత అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. యూనివర్శిటీ ఆఫ్ బహ్రెయిన్‌లోని షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ మహ్మద్ అల్ ఖలీఫా హాల్లో నిన్న ముగిసిన యూత్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫోరమ్ (మైక్రో షబాబ్) ఐదవ ఎడిషన్ చివరి వేడుకకు హాజరై హెచ్‌హెచ్ షేక్ ఖలీద్ ప్రసంగించారు. ఫ్యూచర్ సొసైటీ ఫర్ యూత్ హెచ్‌హెచ్ షేక్ ఖలీద్ ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహాల ద్వారా యువతకు మద్దతివ్వడం, పెట్టుబడి పెట్టడం పట్ల క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నిబద్ధతను కొనియాడుతూ నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







