సౌదీలో అల్-సవారిఖ్ మార్కెట్ మూసివేత
- May 24, 2023
జెడ్డా: జెడ్డా గవర్నరేట్‌కు దక్షిణంగా ఉన్న అల్-సవారిఖ్ మార్కెట్స్ కాంప్లెక్స్‌కు ప్రవేశాలను జెడ్డా మేయర్‌టి మూసివేసింది. వారంలో రెండు అగ్ని ప్రమాదాలు జరగడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. మే 12న జరిగిన మొదటి అగ్నిప్రమాదంలో రహ్మానియా మార్కెట్ కాలిపోగా.. మే 21న జరిగిన రెండో అగ్ని ప్రమాదంలో ఫాల్కన్ మార్కెట్ దగ్ధమైంది. కొన్ని ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత ఈ మూసివేత చర్యలు తీసుకున్నట్లు మేయర్లటీ వెల్లడించింది. అగ్నిప్రమాదంపై జరిపిన దర్యాప్తులో అనేక ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని, ప్రధానంగా దుకాణాల వెలుపల సరుకులను ప్రదర్శించడం, ఉపయోగించిన దుస్తులను విక్రయించడం, అసంఘటిత పద్ధతిలో నిర్వహిస్తున్న స్టాల్స్ ద్వారా గడువు ముగిసిన ఆహార పదార్థాల ప్రదర్శనలు ఉన్నాయన్నారు.
9,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అల్-సవారిఖ్ మార్కెట్ కాంప్లెక్స్.. విభిన్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనే 26 వాణిజ్య సముదాయాలను కలిగి ఉంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్లో విక్రయాల పరిమాణం సంవత్సరానికి $400 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







