అనసూయ ‘విమానం’ ఎగిరేందుకు సిద్ధం.!
- May 24, 2023
అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించిన ‘విమానం’ సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది. తాజాగా సెన్సార్ చేసుకున్న ఈ సినిమాని జూన్ 9న రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.
‘విమానం’ అనే టైటిల్ ఈ సినిమాపై ఆసక్తి రేపుతోంది. కథా, కమామిషు ఏంటనేది తెలీదు కానీ, ఇంతవరకూ రిలీజ్ అయిన పోస్టర్లలో పలు రకాల బోల్డ్ లుక్స్‌లో కనిపిస్తోంది అనసూయ భరద్వాజ్.
ఇంచుమించు ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్రను తలపించేలా వున్నాయ్ అనసూయ లుక్స్. పాత్ర ఎలా వుండబోతోందో చూడాలి మరి.
ఇకపోతే, ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ నటుడు సముద్ర ఖని, కమెడియన్ ధనరాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ అర్జున్ ఈ ఇన్నోవేటివ్ స్టోరీని తెరకెక్కించాడు. చూడాలి మరి, ‘విమానం’ సినిమా ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







